రాష్ట్రంలో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వరంగల్ మల్టీజోన్- 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తాము కల్పించిన అవగాహనతో వీరంతా రాష్ట్ర పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోగా వారిలో 90 శాతం మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే ఉన్నారన్నారు.