హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో సంచలన ప్రకటన..!

-

రాష్ట్రంలో హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్ధం చేసామని తెలిపారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని స్పష్టం చేసారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు అధికారికంగా హైడ్రాకు 5800 ఫిర్యాదులు.. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

27 పురపాలక సంఘాలపై మాకు అధికారం ఉందని వెల్లడించారు. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్టు తెలిపారు. భవన, నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. నాగోల్ లో డీఆర్ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. హైడ్రాకు త్వరలో ఓ ఎఫ్ఎం ఛానల్ కి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version