జగిత్యాల జిల్లాలో పోలీసుల మీద దాడులు ఆగడం లేదు. జిల్లాలో ఆకతాయిలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే అండదండలతో వారు రెచ్చిపోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌కు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం నెలకొంది.
దీంతో బంక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు వచ్చిన పోలీసులపై ఆకతాయిలు దాడికి పాల్పడి పెట్రోల్ బంక్‌లో విధ్వంసానికి యత్నించారు.విధులకు ఆటంకం కలిగించారని బోదుకాని శేఖర్, తమ్మ గంగారాంలపై టౌన్ ఎస్సై గీత కేసు నమోదు చేసింది.
ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో ఒత్తిడి చేసి విడిపించుకొని పోయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు
జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలు
కొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను గంటల్లో విడిపించుకొని పోయేంత
జగిత్యాల జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్న… pic.twitter.com/MEnlbSXqZs
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2024