గొర్రెల పంపిణీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో త్వరలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగిందని పేర్కొన్న సీఎం కేసీఆర్…. రెండో విడత పంపిణీ కోసం మరో 6000 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగిస్తామని ప్రకటించారు. దాంతో పాటు యూనిట్ (20+1) ధరను పెంపు పెంచనున్నట్లు పేర్కొన్న సీఎం కేసీఆర్… బిసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని చెప్పారు. ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుందని వెల్లడించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.