పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్!

-

అవినీతి కేసుల్లో జైలు శిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆయన సతీమణి బుప్రా ఖాన్తో వివాహం చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారికి ఏడేళ్ల కారాగార శిక్ష, చెరో రూ.5లక్షల జరిమానా విధించింది. 2018 సంవత్సరంలో వాళ్లిద్దరు వివాహ చట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నందుకు ఈ శిక్షను విధిస్తూ పాక్‌లోని ఓ కోర్టు తీర్పును ఇచ్చింది.ఇస్లామిక్ చట్టాల ప్రకారం ‘ఇద్దత్’ను పాటించలేదని న్యాయస్థానం తెలిపింది. ఇద్దత్ అంటే.. విడాకులు తీసుకున్న అనంతరం మళ్ళీ వివాహం చేసుకోకుండా వేచి ఉండాల్సిన కనీస నిరీక్షణ వ్యవధి.మాజీ భర్త నుంచి విడాకులు పొందాక నిర్దేశిత గడువు పూర్తికాకుండానే బుష్ర ఇమ్రాన్ను వివాహమాడింది .

ప్రధానమంత్రి కావడానికి సరిగ్గా 7 నెలల ముందు.. 2018 జనవరిలో బుష్రాను ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కాగా వీరిద్దరికీ ఇటీవల మరో కేసులో 14ఏళ్ల జైలు శిక్ష పడింది.వివిధ కేసుల్లో శిక్షలు పడటంతో ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని గార్రిసన్ సిటీ జైలులో ఉండగా, ఇస్లామాబాద్‌లోని హిల్‌టాప్ మాన్షన్‌ లో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా శిక్షను అనుభవించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news