పాకిస్తాన్‌కు మరో షాక్.. ఆ దేశంలోకి వెళ్లే మరో రెండు నదులపై భారత్ కీలక నిర్ణయం

-

పహెల్గాం ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నది. ఎలాగైనా ఈసారి దాయాది దేశానికి తగిన శాస్తి చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దౌత్యపరంగా కఠిన ఆంక్షలు విధించింది.సింధు జలాలను ఆదేశానికి వెళ్లకుండా కట్టడి చేసింది.


తాజాగా మరో రెండు ప్రాజెక్టుల మీద భారత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.చీనాబ్, జీలం నదులపై ఉన్న డ్యామ్‌ గేట్ల మూసివేతకు చర్యలు చేపట్టింది. బాగ్లిహార్ డ్యామ్, కిషన్ గంగా డ్యామ్ నుంచి పాకిస్థాన్‌కు నీళ్లు వెళ్లకుండా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో సగభాగం ఎడారిగా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ చర్యలను సహించలేక పాకిస్తాన్ సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news