ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతాయి..నేతల పార్టీల ఫిరాయింపులతో నిత్యం కోలాహలంగా ఉంటాయి పార్టీ ఆఫీసులు..మరి ముఖ్యంగా అధికార పార్టీ ఆఫీస్ ఎప్పుడు కొత్త నేతలలో కలకలాడుతాయి..టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ నుంచి..వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ నుంచి వలసలు కోనసాగుతాయి..ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన వలసలు ఇప్పటికీ ఆగలేదు..ఎన్నికలకు ముందే పలువురు నేతలు టీడీపీ, బీజేపీ పార్టీలకు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు..స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీని నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి..టీడీపీ అధిష్టానం కొత్త జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తర్వాత చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు..అయితే ఈ కమిటీల్లో తమకు స్థానం లేకపోవడంతో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
టీడీపీకి మరో షాక్..ఈ సారి ఆ నేత జంప్..!
-