ఛత్తీస్‌‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. పలువురి మృతి

-

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గురువారం తెల్లవారు జాము నుంచి గంగలూరు పరిధిలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతుండగా.. వివరాలు వెల్లడించేందుకు స్థానిక పోలీసులునిరాకరించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version