శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీని వెనుకున్న కారణాలు మాత్రం తెలియరావడం లేదు.కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందా? లేదా ఒత్తిడి బాధ భరించలేక విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారా? ఫుడ్ పాయిజన్ వలన ఇలా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారా? అనేది మిస్టరీగా మారింది.
తాజాగా నిజాంపేట శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. తోటి విద్యార్థులు లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో వారు భయంతో మేనెజ్మెంట్కు ఫిర్యాదు చేశారు.మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ వారంలోనే శ్రీ చైతన్య కాలేజీలో చదివే విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.