సల్మాన్ ఖాన్ హత్య కుట్రకేసులో మరొక నిందితుడి అరెస్ట్

-

బాలీవుడ్‌ యాక్టర్ సల్మాన్‌ ఖాన్‌ హత్య కుట్ర కేసులో మరొక నిందితుడు అరెస్టు అయ్యారు. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన వారిలో ఒకడైన సుఖాను హర్యానాలోని పానిపట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని కోర్టు ఎదుట ప్రవేశపెడతామని నవీ ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సల్మాన్‌ ఇంటి బాల్కనీపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్దకు బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసు విచారణ జరుగుతుండగా..జూన్‌లో మరోసారి అతని హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్‌కు దగ్గర్లోని తన ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్ పై దాడి చేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ ముఠా ప్లాన్ చేయగా.. పోలీసులు దానిని తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే నిందితుడి అరెస్టు జరిగింది. కాల్పుల ఘటనపై సల్మాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.తనను, ఫ్యామిలీని హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడిందని నమ్ముతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news