హైదరాబాద్‌లో మరో విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుకి చేసుకుంది. ముందుగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి గాయాలు అయ్యాయి.

అయితే గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలోనే చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. పాతబస్తీ-బండ్లగూడలో ఈ ఘటన నెలకొంది. ఘటనాస్థలికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బండ్లగూడ ప్రమాదంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
గణేష్ విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం
మృతి చెందినవారు అఖిల్, వికాస్‌గా గుర్తింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు https://t.co/WlQQmnDgMr pic.twitter.com/pctc7GcNLh
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025