చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ఆటా డాన్స్ విన్నర్ టీనా మృతి

-

ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆట డాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ మృతి చెందింది. ఓంకార్ నిర్వహించిన ఆట డాన్స్ షో తో టీనా చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సీజన్ ఫోర్ కి జడ్జిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆవిడ గోవాలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె మరణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. టీనా సాదు మృతిచెందినట్టు ఆట సందీప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.

కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా సడన్ గా మరణించడం పై సర్వత్రా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆట సందీప్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో టీనాతో ఉన్న ఫోటో పెట్టి..” టీనా సాదు మరణ వార్త విని ఎంతో షాకయ్యాను. ఆమె మరణ వార్త నన్ను ఎంతో బాధించింది. టీనా సాదు ఎంతో మంచి వ్యక్తి. ఆట సీజన్ వన్ లో నా పార్ట్నర్ కూడా. ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”. అంటూ సందీప్ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version