గుడ్ న్యూస్ : మరో వ్యాక్సిన్ సిద్ధం..!

-

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలోనే ఎవరూ ఊహించని విధంగా తమ కరోనా వ్యాక్సిన్ సిద్ధం అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది రష్యా . ఇక ఇప్పుడు రెండో వ్యాక్సిన్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చేసిన రెండవ వ్యాక్సిన్ కూడా రిజిస్టర్ చేయనున్నట్లు సమాచారం. సైబీరియా కు చెందిన వెక్టర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ గత నెలలోనే ముగిసినట్లు తెలిపిన రష్యా… అక్టోబర్15న రెండవ వ్యాక్సిన్ కూడా రిజిస్టర్ చేయనున్నట్లు తెలిపింది.

అయితే మొదట ఎవ్వరూ ఊహించని విధంగా స్పుత్నిక్ వి అనే పేరుతో రష్యా వ్యాక్సిన్ తెరమీదకు తీసుకు వచ్చి నప్పటి కీ క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవలే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారత్ తో చర్చలు జరుపగా.. భారత్ క్లినికల్ ట్రయల్స్ జరిపిన తర్వాతే ఉత్పత్తికి అంగీకరిస్తామని చెప్పడంతో భారత్లో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రహస్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news