ANR birth anniversary: “నాన్న నాతోనే ఉన్నాడు” కింగ్ నాగ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌!

-

ANR birth anniversary: తెలుగు సినీ వినీలాకాశంలో ఆయ‌నో ధృవతార. తెలుగు సినిమాకు ఆయ‌నో బాలరాజు. ఆయ‌నో బహుదూరపు బాటసారి, భగ్నప్రేమికుడైన ఓ దేవదాసు, ఆయ‌నో క‌లం ప‌ట్టిన కాళిదాసు, మ‌హాభార‌తంలో ఆయ‌నో అర్జునుడు. ప‌ద్మ‌వ్యూహంలో ఆయ‌నో అభిమన్యుడు, ప్రియురాలి ప్రేమ‌కోసం ప‌రిత‌పించే అమర ప్రేమికుడు. అత‌డే అక్కినేని నాగేశ్వరరావు తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌. ఆయ‌న న‌ట‌న‌కు ఎన్నో అవార్డు స‌లాం చేశాయి.

వెండితెర‌పై 75 వసంతాలకు పైగా వెలుగొందారు. సెప్టెంబర్ 20న ఆ న‌ట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అక్కినేనిని స్మరించుకుంటున్నారు. కింగ్ నాగ్ కూడా ఓ ఎమోష‌నల్ వీడియోను విడుదల చేశారు.

“సెప్టెంబర్ 20వ తారీఖు నాకు చాలా ఇంఫార్టెంట్ డే. మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాన్నగారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచె కట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచె కట్టుకున్నప్పుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేసేది. ఆయ‌న‌కు అందులోనూ పుందూర్ ఖద్దరంటే చాలా ఇష్టం. ఇదిగో.. పూందుర్ ఖ‌ద్ద‌రే.. ఇది ఆయన నవరత్నాల హారం, ఇదాయన నవరత్నాల ఉంగరం, ఈ వాచ్ నాకన్నా సీనియర్… ఆయ‌న ఫేవ‌రేట్ వాచ్‌. ఇదిప్పుడో.. నా ఫేవరేట్. ఇవన్నీ నాతో ఉంటే ఆయన నాతోనే ఉన్నట్టు ఉంటుంది. ఏదో తృప్తి… నాన్న గారి పంచె కట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఇది మా ప్రయత్నం ఎన్నార్ లిప్స్ ఆన్” అంటూ వీడియోలో ఎమోష‌న‌లయ్యారు.

ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్‌ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడించారు. ఈ మూవీలో నాగార్జున తన తండ్రి ఏఎన్‌ఆర్‌కి ఇష్టమైన ఈ గెటప్ లోనే కనిపించనున్నారు. చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ప్ర‌ముఖ న‌టి రమ్యకృష్ణ మరోసారి న‌టించ‌నున్న విషయం తెలిసిందే.

http://<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Remembering dear Nana! My hero!! My inspiration!! <a href=”https://twitter.com/hashtag/ANRLivesOn?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#ANRLivesOn</a> <a href=”https://t.co/CgHKCLwObY”>pic.twitter.com/CgHKCLwObY</a></p>&mdash; Nagarjuna Akkineni (@iamnagarjuna) <a href=”https://twitter.com/iamnagarjuna/status/1439821159315345410?ref_src=twsrc%5Etfw”>September 20, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Read more RELATED
Recommended to you

Exit mobile version