‘ సైరా ‘ పై యాంటీ ఫ్యాన్స్ మెగా ట్రోలింగ్‌

-

మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 త‌ర్వాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రాబోతున్న సినిమా `సైరా`. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.  రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ‘సైరా’ మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విడుయోను విడుద‌ల చేయ‌డంతో పాటు మ‌రో ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అది `సైరా` టీజర్ ఈనెల 20న వస్తుందని తెలిపారు. తాజాగా విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ వీడియోలో చిరు డిఫరెంట్ గానే ఉన్నారు. జులపాలు మొహం మీదకు పడుతూ.. మొహంలో రౌద్రంతో క‌నిపిస్తుంటారు.ఇక ఇదిలా ఉంటే విడుద‌ల అయిన సైరా మేకింగ్ విడియో చివ‌రిలో చిరు లుక్‌తో యాంటీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. చిరు లుక్‌పై ట్రోలింగ్ మొద‌లుపెట్టేశారు. ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ‌ శాతకర్ణిలో గెట‌ప్‌లు మ‌రియు రకరకాల ఫోటోలు మిక్స్‌ చేసి సోష‌ల్‌ మీడియాలోకి వదుల్తున్నారు. అయితే నిజానికి అమితాబ్ బచ్చన్ సైరా స్టాటింగ్‌లో వ‌దిలిన లుక్స్‌లో చిరు అందంగానే ఉన్నారు.మేకింగ్ వీడియోలో చిరుని వీరుడి క్యారెక్ట‌ర్‌లో చూసిన‌ యాంటీ ఫ్యాన్స్ అనేక విధాలుగా ట్రోలింగ్ చేస్తు ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌ మీద సెటైర్లు వేస్తున్నారు. ట్రోలింగ్ మ‌రీ ఓవ‌ర్ అవ్వ‌డంతో మెగా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.  ప్ర‌స్తుతం సైరా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version