చిన్న పిల్లలకు యాంటిబయాటిక్స్ ఇస్తున్నారా?

-

చిన్న అనారోగ్య సమస్య వచ్చినా టాబ్ లైట్ వేసేసుకుంటాం..లేకుంటే ప్రాణంపోతుందన్న భయం..పెద్దవాళ్లకు అయితే పర్వాలేదు. మరీ రెండు సంవత్సరాల కంటే చిన్నవారికి యాంటీబయాటిక్స్ ఇస్తే భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనం తేల్చింది.

pain_pills

రెట్రోస్పెక్టివ్ కేస్ స్టడీలో, మాయో క్లినిక్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.రెండు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అందించే యాంటీబయాటిక్స్ అలెర్జీల నుండి ఊబకాయం వరకు కొనసాగుతున్న అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. రోచెస్టర్ ఎపిడెమియాలజీ ప్రాజెక్ట్, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్లలో జనాభా ఆధారిత పరిశోధన సహకారం నుండి ఆరోగ్య రికార్డు డేటాను ఉపయోగించి, పరిశోధకులు 14,500 మంది పిల్లల నుండి డేటాను కలెక్ట్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.

70 శాతం మంది పిల్లలు 2 ఏళ్ళకు ముందే అనారోగ్యానికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారి పరిశోధనలో తేటతెల్లైంది. వీళ్లందరికి బాల్యంలోనే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.అయితే వచ్చే సమస్యలు బాలురు, అమ్మాయిలకు తేడా ఉంటాయని వీరు కనుగొన్నారు. జానికి యాంటీబయాటిక్స్ వాడకం సమస్య ఉన్న అవయువానికే పనిచేయవ్వు..బాడీలోనే అన్ని అవయువాలను ప్రభావితం చేస్తాయి.దీనివలన ఉబ్బసం, అలెర్జీ, బరువు సమస్యలు, ఊబకాయం, అలెర్జీలు వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయట! ఈ విషయాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు నొక్కి చెపుతున్నారు.

భవిష్యత్ పరిశోధనలకు లక్ష్యంగా చేసుకునే ఈ అధ్యయనం చేస్తున్నట్లు లెబ్రాస్సీర్ తెలిపారు.అంతేకాకుండా ఈ అధ్యయానం భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ ను ఎంత మోతాదులో వాడొచ్చు అని నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనంలో చిన్నప్పటి పరిస్థితులు పెరుగుదలను చూపిస్తున్నప్పటికి నిపుణులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే మల్టీడ్రగ్ రెసిస్టేన్స్ సమస్య రాకుండా యాంటీబయాటిక్స్ ను చాలా మంది పీడియాట్రిషియన్లు వాడొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి యాంటీబయాటిక్స్ శరీరంలోని సూక్మక్రిములనే చంపడేమే కాకుండా దీర్ఘకాలిక రోగాలకు సూక్ష్మంగా నాందిపలుకుతున్నాయి.. ఇక నుంచి యాంటిబయాటిక్సే వాడేటప్పుడు జర భద్రం సమస్య తీవ్రంగా ఉంటే తప్ప వీటిని వీటిని వాడొద్దు మరి!

Read more RELATED
Recommended to you

Exit mobile version