టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ ఈడీకి మస్కా కొట్టారు. ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఈ నేతను పోలీసులు కాపాడారు. ఎలా అంటే.. ఈడీ నుంచి ‘కాపాడేందుకు’ అనుబ్రతా మోండల్‌ను రాష్ట్ర పోలీసులు ఓ పాత కేసులో అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను దుబ్రాజ్పుర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయన్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా అనుబ్రతా మోండల్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకుంది. కేసులో నిందితుడైన ఎనముల్ హక్, మాజీ బాడీగార్డ్ సైగల్ హొస్సైన్తో కలిపి మోండల్‌ను దిల్లీలో విచారించాలని అనుకుంది. అయితే, బంగాల్ పోలీసుల రంగప్రవేశంతో సీన్ మారిపోయింది.