ఇండియన్ సినిమా విషాదంలోకి వెళ్లిపోయింది. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం ఇప్పుడు బాలీవుడ్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టుకునేలా చేస్తుంది. ఆయనతో ఎందరో నటులకు మంచి అనుబంధం ఉంది. విలక్షణ నటుడిగా, వ్యక్తి పరంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీనితో ఆయనతో ఉన్న జ్ఞాపకాలను అందరు నటులు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకునే ప్రయత్న౦ చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఒక వీడియో ని విడుదల చేసారు ఆయనతో తనకు ఉన్న అనుభవాన్ని నెమరవేసుకున్నారు. ఒక ఆత్మీయ మిత్రుడుని, సన్నిహితుడ్ని కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. ఇర్ఫాన్ ఖాన్ డ్రామా స్కూలులో నాకు జూనియర్ అని గుర్తు చేసుకున్నారు. ఇర్ఫాన్ మృతి కేవలం హిందీ పరిశ్రమకే కాదు, దేశానికి, అంతర్జాతీయ సినిమా ప్రపంచానికి కూడా లోటే అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన చాలా ప్రతిభావంతుడైన నటుడన్నారు. అంతకుమించి మంచి మానవతా వాది అంటూ చెప్పుకొచ్చాడు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అన్నారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. ఎంతో దయార్ద్ర హృదయుడు’ అని ఖేర్ గుర్తుచేసుకున్నారు. అసలు 53 ఏళ్లంటే అది పెద్ద వయస్సు కూడా కాదన్నారు ఆయన. ఆయన గురించి వార్త తెలియగానే ఆయన భార్య, పిల్ల గుర్తొచ్చి,
తనకు ఎంతో బాధ కలిగిందని ఖేర్ కంటతడి పెట్టుకున్నారు. ఇర్ఫాన్ ఇక లేడనే విషయం జీర్ణించుకోవాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు. యావత్ ప్రపంచం ఆయనను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఒక ప్రియమిత్రుడిని కోల్పోవడం కంటే విషాదం, గుండెకోత మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా విషాదకరమైన రోజన్నారు ఆయన. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి అని వీడియో లో వ్యాఖ్యానించారు.
Nothing can be more heartbreaking and tragic than the news of passing away of a dear friend, one of the finest actors and a wonderful human being #IrrfanKhan. Saddest day!! May his soul rest in peace. #OmShanti ? pic.twitter.com/QSm05p7PfU
— Anupam Kher (@AnupamPKher) April 29, 2020