ప్రభాస్ స్పిరిట్ కోసం అనుష్క?

-

పాన్ ఇండియన్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. స్పిరిట్ సినిమాను ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా అనేకమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హీరోయిన్ అనుష్క శెట్టిని అనుకుంటున్నారట.

PRABHAS ANUSHKA

అనుష్క శెట్టి – ప్రభాస్ కాంబినేషన్లో కొన్ని కీలక పాత్రలను తెరకెక్కించాలని డైరెక్టర్ ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది అయితే ఈ పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుందని ఆ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. గతంలో ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ తెరపైన కనిపిస్తే అభిమానులకు సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయం పైన చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news