‘సర్కారీ వారి పాటల’ లో స్వీటీ.. పాత్ర ఏంటో తెలుసా..!?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు… అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ జంటగా.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజురోజుకు కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే మరో వార్త సర్కార్ వారి పాట సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట సినిమాలో టాలీవుడ్ క్వీన్ అనుష్క కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన బ్యాంకు ఉద్యోగి పాత్రలో అనుష్క నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులందరూ ఆనందపడి పోతున్నారు. అయితే గతంలో కాలేజ్ సినిమాలో మహేష్ బాబు అనుష్క కలిసి నటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version