అంచనాలు పెంచుతున్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్..!

-

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న నిశ్శబ్దం చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ రెండవ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఎట్టకేలకు అక్టోబర్ 2న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. సినీ నటుడు రానా ట్విట్టర్ వేదికగా నిశ్శబ్దం ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ గా మారిపోయింది. సినిమాలో అనుష్క నటన అద్భుతంగా ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. చెవిటి మూగ అమ్మాయి గా నటిస్తున్న అనుష్క పాత్ర ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. శాలిని పాండే పాత్ర కూడా ఆసక్తిని రేపుతోంది ఇక మొత్తంగా ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవ్వబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news