నా ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కంటా…!

-

ప్రముఖుల గురించి మీడియా చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా సరే మీడియా అనవసరంగా అతి చేస్తూ కొన్ని కొన్ని ప్రచారాలు అనవసరంగా చేస్తూ ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తూ ఉంటుంది. పెళ్లి అయిన వాళ్ళ విషయంలో, ప్రేమలో ఉన్న వాళ్ళ విషయంలో చేసే అతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని…

పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలను ఎప్పుడు కంటారు అని మీడియా హడావుడి చేస్తుంది. ఆ పిల్లలకు పెట్టే పేరు వేసే బట్టలు అన్నీ కూడా మీడియాకు అవసరమే. దీనిపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఫైర్ అయింది. తాను పిల్లలను కనే విషయంలో మీడియా చేస్తున్న హడావుడిపై స్పందించిన ఆమె… ఈ విషయంలో చాలా ఊహాగానాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా అని… తల్లిని కావడానికే తాను విరామం కోరుకుంటున్నానని,

చాలా మంది అన్నారని.. అవన్నీ నిజం కావని స్పష్టం చేసింది. తాను సినిమాలు చేయడం లేదంటే నాకు నచ్చిన కథ దొరకడం లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు డబ్బుల కోసమని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవలసిన అవసరం లేదని పేర్కొంది. త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాను అంది. పిల్లల్ని కనడానికే విరామం తీసుకోనవసరం లేదని నా అభిప్రాయమని పేర్కొంది. నటిస్తూ కూడా పిల్లల్ని ప్లాన్‌ చేసుకోవచ్చని చెప్పింది. నేను పిల్లల్ని కనడానికి ఇంకా సమయముందని… అయినా ఎప్పుడు పిల్లల్ని కనాలన్నది నా వ్యక్తిగతమని స్పష్ట౦ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version