పాపం.. జేజమ్మ అప్పుడు తొంద‌ర ప‌డింది.. ఇప్ప‌డు బాధ‌ప‌డుతుంది..!

-

అనుష్క‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవి అవ‌స‌రం లేదు. దేవసేన, భాగమతి, జేజమ్మ.. అగ్ర కథానాయిక అనుష్క పేరు చెబితే గుర్తొచ్చే పాత్రల పేర్లు ఇవి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ.. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. అయితే ఈ జేజ‌మ్మ తొంద‌ర‌పాటు వ‌ల్ల ఇప్పుడు బాధ‌పడుతుంది. అయితే ఇది సినిమాల విషయంలో కాదు లెండి. ఆస్తుల విషయంలో! ఇంతకీ ఏమైందంటే, సినిమాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తున్న సమయంలో అనుష్క, హైదరాబాద్ లోని ఓ పోష్‌ లొకాలిటీలో ఖరీదైన ఫ్లాటు కొంది. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన తరువాత, ప్రత్యేక రాష్ట్రం వస్తే, భూముల ధరలు పడిపోతాయేమో అన్న భయంతో దాన్ని రూ. 5 కోట్లకు అమ్మేసిందట.

అనుష్క తన మనసులో అనుకున్నట్టుగా ఫ్లాట్ ధర పడిపోకపోగా, ఇప్పుడు దాని ధర రూ. 15 కోట్ల వరకూ పెరిగిందట. ఇక ఇదే సమయంలో విశాఖపట్నంలోనూ అనుష్క ఇదే తరహాలో పప్పులో కాలేసింది. అప్పుడెప్పుడో విశాఖలో భూములను కొనుగోలు చేసిన అనుష్క, చంద్రబాబు సీఎం అయిన తరువాత, అమరావతి అభివృద్ధి చెందుతుందని, విశాఖలో భూముల ధరలు పెద్దగా పెరగబోవని అనుకుంటూ వాటిని కూడా విక్రయించింది. ఇప్పుడు మాత్రం తాను తొందరపడ్డానని బాధపడుతోందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version