టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. ప్రస్తుతం ఎంత మంది యువ హీరోయిన్స్ వచ్చినా సరే ఆమె డిమాండ్ మాత్రం తగ్గలేదు. అగ్ర హీరోలతో సినిమా అనగానే ఆమె పేరునే పరిశీలిస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె హీరోలతో సినిమాలు చేయకుండా సోలోగా చేస్తుంది. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసిన సంగతి తెలిసిదే.
ఇక ఈ భామ సినిమాలు చేయడం మొదలుపెట్టి నేటికి అంటే మార్చ్ 12 కి సరిగా 15 ఏళ్ళు. నాగార్జున హీరోగా సూపర్ సినిమాలో నటించింది ఈ హీరోయిన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె టాలీవుడ్ లో, తమిళంలో ఎందరో హీరోల పక్కన సినిమాలు చేసింది. దాదాపు అందరు అగ్ర హీరోల పక్కన ఆమె సినిమాలు చేసారు. అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది ఈమె.