ఏపీ అసెంబ్లీ ఈనెల 28కి వాయిదా

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన సభ.. మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా.. బీజేపీ, జనసేన, టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ సభ్యులు నిన్న సభలో వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  వైసీపీ సభ్యులు ప్రవర్తనకు గవర్నర్ కి సారీ చెప్పారు.

11 మంది సభ్యులుంటేనే ఇంత రాద్దాంతం చేశారని.. వారికి ప్రజలు ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చి ఉంటే విధ్వంసం చేసేవారని ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలు భవిష్యత్ లో వైసీపీకి 11 సీట్లు కూడా ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం 6.30గంటల తరువాత ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణం ఆమోదం తెలిపింది. అనంతరం సభను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించాడు. ఈనెల 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. 28న అసెంబ్లీలో బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేవపెట్టనుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version