Breaking : ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఒక్క రోజు మాత్ర‌మే

-

ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ సమావేశాలు న‌వంబ‌ర్ 18 నుంచి ప్రారంభం అవుతాయ‌ని ప్ర‌చారం సాగింది. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అసెంబ్లీ స‌మావేశాల‌ను కేవ‌లం ఒక్క రోజే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త్వర‌లో రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రోసారి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

కాగ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల న‌వంబ‌ర్ 18 న మాత్రమే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు డిసెంబ‌ర్ నెల‌లో జ‌రుగుత‌న్నాయి. అయితే డిసెంబ‌ర్ నెల చివ‌రి వారంలో కాని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రీ నెల‌లోని మొదటి వారంలో గానీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే న‌వంబ‌ర్ 18న జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుదా అనే సందేహం అంద‌రీ లో క‌లుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version