BREAKING: 10 రోజులు పాటు సాగ‌నున్న అసెంబ్లీ సమావేశాలు..వైసీపీ వాకౌట్‌

-

BREAKING: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు పాటు సాగ‌నున్నాయి. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సమావేశం జ‌రుగ‌నుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.

chandrababu bac
Ap Assembly sessions to continue for 10 days

సెలవు రోజులు, పని దినాలపై బీఏసీలో కసరత్తు జరుగుతోంది. ఈ సభలో చర్చించేందుకు 18 అంశాలను ప్రతిపాదించింది టీడీపీ. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీసభ్యులు వాకౌట్ చేశారు. తిరుపతి, సింహాచలంలో జరిగిన తొక్కిసలాట ఘటనలపై మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిరసనగా ఈ వాకౌట్ జరిగింది. తొక్కిసలాట ఘటనలను తేలికగా తీసుకుంటూ, వాటిని అదృష్టవశాత్తు జరిగిన సంఘటనలుగా అభివర్ణించడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలు బాధ్యతా రహితంగా ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వారు వాదించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news