స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలందరికీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళలకు మధుమేహం, రక్తపోటు, రొమ్ము, నోటీ, గర్భాశయ, ముఖద్వారా క్యాన్సర్ల నిర్ధారణకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 13,944 శిబిరాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు సేవలు అందిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహిళలు ఉచితంగా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి విజయాన్ని అందుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.