నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

-

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ప్రభుత్వం శానససభ నిర్వహణ వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ లను ఆమోదించుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మొత్తం 14 ఆర్డినెన్స్  లను ఆమోదించుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.

ఇదిలా ఉంటే టీడీపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై విమర్శలు చేస్తోంది. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుక ప్రభుత్వం ప్రయత్నించాలంటోంది. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు పొడగించాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సభలను అభాసుపాలు చేస్తోందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్‌పీ విమర్శలు చేసింది. ప్రస్తుతం ఏపీ లో జరిగిన స్థానిక పోరులో వైసీపీ గెలుపొందడంతో టీడీపీ ప్రభుత్వ తీరును, ఎన్నికలు జరిగే విధానంపై విమర్శలు చేస్తోంది. దీంతో ఈ సమావేశాలు కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version