అల్లు అర్జున్ విషయంపై బండి సంజయ్ రియాక్షన్..!

-

అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏ మాత్రం సరికాదు అని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయి. అదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లడంలో అల్లు అర్జున్ సహా తెలుగు నటీనటులు, దర్శక నిర్మాతలు చేస్తున్న క్రుషి మరువలేం. అయినప్పటికీ పనిగట్టుకుని అల్లు అర్జున్ ను, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం, పవిత్రమైన శాసనసభను వేదికగా మార్చుకోవడం అత్యంత బాధాకరం.

‘సంధ్య’ థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోరుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ సమస్య ముగిసిన తరువాత కూడా ప్రజా సమస్యలను దారి మళ్ళించేందుకు కావాలనే సీఎం మళ్లీ ఆ సమస్యను తెరపైకి తేవడం విడ్డూరం. ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం వాళ్లతో శాసనసభలో ప్రశ్న అడిగించుకుని మరీ సమాధానం ఇవ్వడం సిగ్గు చేటు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచన చేరి ఆర్ధిక ప్రయోజనం పొందడం ఒవైసీ సోదరులకు అలవాటే. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచారు. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరారు. కాంగ్రెస్ కు అదే గతి పడుతుంది అని బండి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version