రాజధాని అసైన్డ్ భూ కుంభకోణం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలని దాఖలైన క్యాష్ పిటిషన్ విచారణ మీద హైకోర్టు విచారణ జరిపింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వారికి ఊరట నిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మూడు వారాలు పొడిగించిన హైకోర్టు, తదుపరి విచారణ ఈ నెల 20 కి వాయిదా వేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దళితుల అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి లాక్కున్నారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సీఐడీని ఆశ్రయించారు. విచారణ జరిపిన సీఐడీ అధికారులు చంద్రబాబుకు, నారాయణకు నోటీసులు జారీ చేశారు.