AP Budget 2023-24 : ఏపీ బడ్జెట్​కు కేబినెట్ ఆమోదం.. రూ. 2. 79 లక్షల కోట్లతో పద్దు

-

మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఏపీ కేబినెట్ సమావేశమైంది. 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ ఏడాది బడ్జెట్​లో నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్​ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు జరిపినట్లు సమాచారం. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట పీట వేసినట్లు తెలిసింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version