సర్వే రాళ్ల పై జగన్ బొమ్మ తీసేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్  క్యాబినెట్ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా  గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్ల అంశం ఓ చర్చకు వచ్చింది. సర్వే రాళ్ల పై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ, పేరు తొలగించాలని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బొమ్మల పిచ్చితో జగన్ రూ.700కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు.

దీంతో జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి క్యాబినెట్ ఓకే చెప్పింది. అదేవిధంగా రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించారు. భూముల రీ-సర్వేపై క్యాబినెట్ లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీ-సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై కూడా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల భూ యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు  వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version