ఏపీ మత్స్య కార్మికులకు గుడ్ న్యూస్.. 217 జీవో రద్దు !

-

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా మత్స్య కార్మికులకు నష్టం చేస్తున్న 217 జీవోను  చంద్రబాబు కేబినెట్ రద్దు చేయడం జరిగింది. దీంతో మత్స్య కారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.  అలాగే  కొత్త ఎక్సైజ్ పాలసీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు.

గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్ల అంశం చర్చకు వచ్చింది. సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ, పేరు తొలగించాలని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బొమ్మల పిచ్చితో జగన్ రూ.700కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. దీంతో జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి క్యాబినెట్ ఓకే చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version