ఏపీ కాబినెట్ సమావేశం ముగిసింది. నవరత్నాలు అమలు క్యాలెండర్ కి కాబినెట్ ఆమోదం తెలిపింది. అసంపూర్ణ భవనాల నిర్మాణానికి, MRDAకు 3వేల కోట్లు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 300 చదరపు అడుగుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇక ఈ కాబినెట్ భేటీలో కాకినాడ ఎస్‌ఈజెడ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
మంత్రి కన్నబాబు అధ్యక్షతన కమిటీ నివేదిక ఇచ్చింది. 6 గ్రామాల పరిధిలోని 2,180 ఎకరాల భూములను రైతులకు వెనక్కి ఇవ్వాలని కమిటీ సూచించగా కమిటీ సూచనను ఏపీ కేబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ లో స్థానిక ఎన్నికల పై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల పై కూడా చర్చ జరిగింది. అన్ని ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులకు సీఎం జగన్ తెలిపారు. ముందు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహణ చేపట్టమని కొరతామని వ్యాఖ్యానించిన సీఎం కోవిడ్ వాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే కేసులు మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు.