ఏపీ కేబినేట్ నిర్ణయాలు ఇవే…!

-

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్, ఏపీ బడ్జెట్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సమావేశం అయింది. కరోనా నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? దీన్ని ఎలా అరికట్టాలనే దానిపై కేబినేట్ సమావేశ జరిగింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో భాగంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్‌ కమిటీ వేసింది.

ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఇక ఈ సమావేశంలో బడ్జెట్ కి కూడా మూడు నెలల బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలపై,

కేబినెట్‌ సబ్‌ కమిటీకి వైద్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ. 2 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్ధిక ప్రగతి కుదేలైందని కెబినెట్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఆర్ధికంగా దేశానికి, రాష్ట్రాలకూ కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సీఎం జగన్ ఈ భేటీలో మంత్రులకు వివరించారు. నిరోధక చర్యలపై అవసరమైన ఖర్చుకి వెనకాడవద్దని ఈ సందర్భంగా సీఎం తేల్చిచెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను అక్కడే ఉంచి.. వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version