తెలంగాణ సంస్థలకు ఏపీ చైర్మన్లను నియమించడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీస్ కంప్లెయింట్ అథారిటీ ఛైర్మన్‌గా అమలాపురం వ్యక్తిని నియమించగా.. పీసీబీ అప్పిలేట్ అథారిటీ ఛైర్మెన్‌ను రామచంద్రపురం వ్యక్తిని నియమించినట్లు తెలుస్తోంది.

మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా ఏపీ మాజీ ఐపీఎస్..ఏపీ సీఎం బాబు కనుసన్నుల్లో తెలంగాణ సీఎం పని తీరు అంటూ ఇక్కడి తెలంగాణ వాదులు విమర్శలు చేశారు. ఖాళీల భర్తీ, సర్కారు నియామకాల్లో ఏపీ సీఎం డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడుస్తున్నరని విమర్శలు వస్తున్నాయి.
సంస్థలకు తెలంగాణ చైర్మన్లుగా తెలంగాణ వ్యక్తులు పనికిరారా? అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఇక ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.