ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభను వరంగల్ లోని ఎల్కతుర్తి వద్ద నిర్వహించేందుకు గులాబీ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. స్టేజీ మీద నాలుగు వందల మంది పట్టేలా భారీగా స్టేజీ నిర్మాణం జరుగుతోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వ్యవసాయ కాలువలు, వాగులను ధ్వంసం చేస్తున్నారని వర్థన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు.దేవాదుల కాలువను పూర్తిగా పూడ్చేశారని.. వేలాది ట్రిప్పుల మొరం తరలిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.పూడ్చిన పెద్ద వాగు, దేవాదుల కెనాళ్లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు డిమాండ్ చేశారు.