రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్ని ప్రత్యేక జీవోతో ఎత్తేస్తాం : చంద్రబాబు

-

రాష్ట్రంలో జర్నలిస్టు ల పై ఉన్న కేసులన్ని ప్రత్యేక జీవోతో ఎత్తేస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర. దేశంలో ఏపార్టీకి ఇలాంటి ఘనత లేదు. గోదావరి బనకచర్ల అనుసంధానం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కుప్పంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేశాము. కుప్పం అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికను రూపొందించాము. జననాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాను. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా, యాప్ ద్వారా చెప్పుకోవచ్చు. ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చాం. కార్యకర్తలు ప్రజాస్వామ్యం లో చాలా కీలకం‌.

టెక్నాలజీ ద్వారా ప్రజలు, కార్యకర్తలు సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తాం. భూ సమస్యలు అనేది ఐదేళ్ళుగా తీవ్రంగా పెరిగాయి‌‌. కుప్పంలో జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతాము. జననాయకుడు లో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ ఎంట్రీ చేస్తాం. వారి పరిస్థితి బట్టి ఆర్దిక సహాయం చేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version