కేంద్ర మంత్రితో జగన్ మాట్లాడింది ఇవే…!

-

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో అరగంట పాటు ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. 2021 చివరి నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్… కేంద్ర సాయం కోరారు.

Jagan

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు అందించాలని విజ్ఞప్తి చేసారు. పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రి కోరిన ముఖ్యమంత్రి… అభ్యర్ధనకు మంత్రి స్పందించారు. త్వరలోనే పోలవరం పర్యటన కు వస్తానని మంత్రి పేర్కొన్నారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంపైనా చర్చ జరిగింది. నదుల అనుసంధానం అంశంపై అధ్యయనం కోసం రాష్ట్ర పర్యటన కు వెళ్లాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్ కు సూచించారు కేంద్ర మంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version