ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన హామీలు, వాటి సమస్యల పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజించి ఏడేళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు విభజన హామీలు నెరవేరలేదని ప్రధాని మోడీతో చెప్పనున్నారు. పెండింగ్ లో ఉన్న విభజన హామీలను అన్నింటినీ నెరవేర్చాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరనున్నారు.
వీటితో ఆంధ్ర ప్రదేశ్ లో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సని బకాయిలను విడుదల చేయాలని కోరనున్నారు. వీటితో పాటు పక్క రాష్ట్రం తెలంగాణతో ఉన్న జల వివాదాల గురించి కూడా ఏపీ సీఎం జగన్ పీఎం మోడీతో చర్చించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను అప్పగిస్తే తామూ కూడా అప్పగిస్తామని ప్రకటించారు. దీని పై కూడా చర్చించే అవకాశం ఉంది. మోడీతో సమావేశం అయిన అనంతరం హోం మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఏపీ సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది.