రాజకీయం తీరు ఎలా ఉన్నా
మన దగ్గర ఉన్న నాయకులు అంతా
ఇప్పుడిప్పుడే చిన జియరు స్వామీజీ దగ్గరకు వెళ్తున్నారు
పేరుకు సమతామూర్తి దర్శనం అయినా కూడా
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ లాంటి ప్రభుత్వ పెద్దలకు
మతం పేరిట నడిపే స్నేహం అన్నది అత్యంత అవసరం కావొచ్చు
అయినా క్రేజ్ ఉన్న చోటుకే మన నాయకులు కూడా వెళ్లాలి వెళ్తారు కూడా!
ఆ విధంగా సమతా మూర్తి ఉన్న ఆశ్రమానికి జగన్ వెళ్లాలి వెళ్లేరు కూడా!
తెలంగాణ వాకిట ముచ్చింతల్ (శంషాబాద్ సమీపం) లో నెలకొల్పిన సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహం అనేక ప్రత్యేకతలకు ఆనవాలుగా నిలుస్తోంది.ముఖ్యంగా హైందవ ఖ్యాతిని చాటేలా ఉంది. ఇదే సమయాన రాజకీయంగా కూడా అధిక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.నిన్నటి వేళ విగ్రహావిష్కరణకు విచ్చేసిన నరేంద్ర మోడీ అనేక వివాదాలకు కారణం అయ్యారు.ముఖ్యంగా టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడిచేందుకు ఆయనే కారణం అయ్యారు. దీంతో జ్వర రాజకీయం వైరల్ అయింది.
ప్రస్తుతానికి ఈ వివాదం పెద్దగా వేడి రాజేయకుండా ఉండాలంటే మరో ఇష్యూను ఏదో ఒకటి అందుకోవాలి. ఆ కోవలో ఆ తోవలో గులాబీ దండు ఉంది. ఇక ఇవాళ సమతా మూర్తి దగ్గరకు జగన్ వెళ్లారు. ఇది మరో ఆసక్తికర పరిణామం. ఎప్పటి నుంచో మై హోం కంపెనీ అధినేత జూపల్లి రామేశ్వరరావుతో సన్నిహిత బంధాలు,ఆర్థిక బంధాలు ఉన్న జగన్ ఆ బంధాలకు మరింత విలువ ఇస్తూ ఇవాళ సమతామూర్తి ఉన్నప్రాంగణానికి అదేవిధంగా ఆశ్రమానికి చేరుకుని వీలున్నంత మేర అక్కడ గడిపేందుకే ఎక్కువ విలువ ఇచ్చారు.
దీంతో స్వామీజీతో సహా చాలా మంది పెద్దలకు ఈ పరిణామం చాలా ఆనందాలను ఇస్తోంది.వాస్తవానికి జగన్ తో పాటు జగన్ అనుచరులు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి పెద్దలకూ చిన జియరు స్వామిజీనే పెద్ద దిక్కు. కనుక ఇవాళ ఆశ్రమంలో ఏ పరిణామం జరిగినా అటు ఆంధ్రా కానీ ఇటు తెలంగాణ కానీ ఆసక్తిగానే చూస్తాయి. చూస్తున్నాయి కూడా! స్వామికి అందరూ అయినవాళ్లే..అన్న భావన స్థిరం చేసేందుకు నిన్నటి వేళ పవన్ కూడా వచ్చి వెళ్లారు.ఇక బీజేపీ,టీఆర్ఎస్ నేతలు అంతా స్వామీజీ అనుచరులే..మిగిలింది ఎవరు టీడీపీ మాత్రమే! మరి! బాబు గారికి పిలుపు ఉందా లేదా? ఆ ఒక్క ముక్క
చెబితే మేం సంతోషిస్తాం స్వామీజీ!