ఆ మంత్రికి జ‌గ‌న్ వార్నింగ్ ఇప్పించాడా…!

-

ఏపీ ముఖ్యమంత్రిగా ఇటీవలే వంద రోజులను పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పాల‌నా ప‌రంగా తొలి రెండు నెలల్లో పూర్తి దూకుడుతో ముందుకు వెళ్లిన జ‌గ‌న్ ఇటీవ‌ల మీడియాపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా లైట్ తీస్కొని త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇక విప‌క్షాల‌పై మంత్రులు, పార్టీ నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక అందరితో పోలిస్తే ప్రతి అంశంపై ప్రభుత్వం తరఫున మొదటగా మాట్లాడుతూ ‘ మీడియా సీఎం ’గా బొత్స పేరు తెచ్చుకున్నారు.

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు కూడా బొత్స ఇక్క‌డ చేసిన హంగామా ? అంతా ఇంతా కాదు. బొత్స‌ తానే సీఎం అన్న‌ట్టుగా మాట్లాడుతున్నారని వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. బోటు ప్ర‌మాదం ఒక్క‌టే కాదు.. కోడెల మృతి, అమ‌రావ‌తి రాజ‌ధాని మార్పు ఇలా ప్ర‌తి విష‌యంలోనూ బొత్స ఏదో ఒక‌టి మాట్లాడ‌డంతో అది వివాదానికి దారి తీస్తోంది. రాజ‌ధాని విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ మామూలుగా లేదు. చివ‌ర‌కు సామాన్య జ‌నాల్లో సైతం రాజ‌ధాని మారిపోతుందా ? అన్న సందేహాలు క‌లిగాయి.

చివ‌ర‌కు ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ట్టు క‌నిపించింది. బొత్స తెరపైకి తీసుకొచ్చిన ఈ వివాదంపై ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఈ రచ్చ ఇంకా కొనసాగుతోంది. బొత్స తీరుతో జ‌గ‌న్ విసిగిపోయిన‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్ క‌దా ? అని చూస్తూ ఊరుకుంటుంటే బొత్స చేస్తోన్న తీరుతో పార్టీకి, ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తాను నేరుగా వార్నింగ్ ఇస్తే బాగోద‌ని… విజ‌య‌సాయిరెడ్డి చేత వార్నింగ్ ఇప్పించిన‌ట్టు తెలుస్తోంది. వైసీపీలో జ‌గ‌న్ త‌ర్వాత ఎంతో కీల‌కంగా ఉండే విజ‌య‌సాయిరెడ్డి లాంటి నేతే ప్రభుత్వం తరఫున అన్ని విషయాల్లో కలగజేసుకోవడం లేదు. కేవలం ట్విట్టర్‌లో మాత్రమే ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు బొత్స చెలరేగిపోతుండటంపై విజయ సాయి జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు నోరు కాస్త అదుపులో పెట్టుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version