ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,06,029 కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 19 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,606 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,770 యాక్టివ్ కరోనా కేసులు న్నాయి.
ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7,70,653 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 51,544 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 76,21,896 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 21, చిత్తూరులో 289, తూర్పుగోదావరి జిల్లాలో 313, గుంటూరులో 295, కడపలో 85, కృష్ణాలో 74, కర్నూలులో 63, నెల్లూరులో 98, ప్రకాశంలో 104, శ్రీకాకుళంలో 18, విశాఖపట్నంలో 85, విజయనగరంలో 59, పశ్చిమ గోదావరిలో 397 కేసులు నమోదయ్యాయి.