ఏపీలో విషాదకర ఘటన – మా కూరుతుని చంపేసుకుంటాం..అనుమతి ఇవ్వండి…!!!

-

ఏపీ లో జరిగిన ఈ ఘటన అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏపీలో చిత్తూరు జిల్లాకి చెందిన ఓ పేద కుటుంభంలో ఇప్పుడు ఈ విషాదకర సంఘనట చోటు చేసుకుంది.  రోజు వారి కూలిగా కేవలం రోజుకి 300 రూపాయలు సంపాదించే అతడికి అతి పెద్ద కష్టం వచ్చింది. తన కూతురికి  హైపో గ్లైసీమియా అనే వ్యాధి రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ వ్యాధి తగ్గడానికి సుమారు ఆమె కోసం సుమారు 12 లక్షల రూపాయలకి పైగానే ఖర్చు చేసినట్టుగా తల్లితండ్రులు తెలిపారు. అయినా

ఇప్పటివరకూ వ్యాధి తగ్గలేదని, తమ కుమార్తె ఈ బాధని అనుభవిస్తుంటే చూడలేక పోతున్నామని, ఎంతో శారీరక భాదని తమ కుమార్తె పడుతోందని ఈ భాదల నుంచీ ఆమెని విముక్తి చేయడానికి మెర్సీ కిల్లింగ్ కి అనుమతి ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రికి ఆర్జీ పెట్టుకున్నారు.

 

ఆమెకి చికిత్స చేయించి బ్రతికించుకోవడానికి వారి ఆస్తి పాస్తులు , ఇంట్లో ఉన్న నగలు అన్నీ తాకట్టు పెట్టామని, తదుపరి చికిత్స ఖర్చుల కోసం తమ వద్ద డబ్బులు లేవని , ఆమెకి చికిత్స చేయడానికి , బ్రతికించుకోవడానికి వేరే మార్గం లేదని తెలిసిందని. తమ కూరుతూ పడుతున్న ఈ బాధని చూడలేక పోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. తమ కూతురిని చంపేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version