కొడుకుని దారిలో పెట్టడానికి తల్లి చేసిన పని…నెట్టింట్లో వైరల్…!!!

-

కొడుకు చెడ్డ మార్గంలో వెళ్తుంటే ఈ కాలంలో ఎంతో మంది పట్టించుకుంటున్న పాపాన లేదు. అసలు కొడుకు, కూతురు రోజు వారి కార్యక్రమాలు ఎలా గడుపుతున్నారో, సమాజంలో ఎలా ఉంటున్నారో తెలుసుకోవడానికి కూడా తల్లి తండ్రులకి సమయం ఉండటంలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది పిల్లలు తప్పుడు దోవలో వెళ్తున్నారు. ఒక వేళ మీ కొడుకు తప్పు చేస్తున్నాడు అంటూ ఎవరైనా చెప్పినా, స్కూలు టీచర్స్ హెచ్చరించినా చెప్పింది చాల్లే నా పిల్లల గురించి నాకు తెలుసు అంటూ ఎదురు దాడి చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అమెరికాలో ఓ మహిళ మాత్రం అందరిలా ఆలోచన చేయలేదు.

మీ కొడుకు స్కూల్ లో టీచర్స్ తో దురుసుగా ఉంటున్నాడు. అసలు మాట వినడం లేదు. ఇలా అయితే మీ అబ్బాయి భవిష్యత్తు దెబ్బతింటుంది అని చెప్పిన టీచర్స్ కి కృతజ్ఞతలు చెప్పింది. నేను చూసుకుంటా  ఈ ఒక్క సారికి మన్నించమని చెప్పింది. అనుకున్నదే తడువుగా కొడుకుతో కలిసి స్కూల్ కి వెళ్ళింది. కొడుకుని క్లాసు రూమ్ కి వెళ్ళమని చెప్పి ప్రిసిపాల్ ని కలిసింది. ఆయన అనుమతి తీసుకున్న ఆమె..

 

కొడుకు ఉన్న క్లాస్ రూమ్ కి వెళ్ళింది. షాక్ అయిన కొడుకు అలానే చూస్తున్నాడు. అతడి దగ్గరగా వెళ్లి పక్కనే కూర్చుంది. ఇక నుంచీ తన కొడుకు మారే వరకూ తాను కూడా స్కూల్ కి వస్తాను అని చెప్పింది. దాంతో షాక్ అయిన కొడుకు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ సన్నివేశాన్ని సెల్ఫి తీసుకుని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ తలి చేసిన పనికి సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version