17 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేసిన ఏపీ డీజీపీ..!

-

అనకాపల్లి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేసారు ఏపీ డీజీపీ. జిల్లాలో 2022 నుండి ఇప్పటి వరకు 34,419 వేల కేజీల గంజాయి, 39 కేజీలా లిక్విడ్ గంజాయి దొరికింది. ఈ గంజాయి విలువ రూ 17 కోట్ల 60 లక్షలు. మొత్తం కేసుల సంఖ్య 459.. అరెస్ట్ అయిన వ్యక్తులు 1,304.. స్వాధీనం చేసుకున్న మొత్తం వాహనాలు 205 అని పోలీసులు తెలిపారు. పరవాడ ఫార్మసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ లో భారీగా గంజాయి ధ్వంసం చేసారు.

అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం. గంజాయిని సమూలంగా నిర్ములించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి IG అధికారిని నియమించాం. తనిఖీలు పెంచాం, చెక్ పోస్ట్ ల వద్ద.. ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్స్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి. ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు ఉంది. గంజాయి పండించే గిరిజనులను చైతన్యవంతం చేస్తున్నాం. యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.. గంజాయి మహమ్మారి కి బానిసలుగా మారోద్దు అని డీజీపీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news