జూన్‌ లోపు నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తాం : చంద్రబాబు

-

జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే…ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలి. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి….1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తాం. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తాం…దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలి. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తాం.

ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలి. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టాం.. ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలి. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం…ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టండి. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తాం అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news