దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలపై ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ లో ప్రకటించింది .కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే ఫలితాలు రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.
కాగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.