Breaking : ఏపీకి మరో అవార్డ్‌.. అభినందించిన సీఎం జగన్‌

-

ఏపీకి మరో అవార్డ్‌ దక్కింది. ఏపీ ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఇంధన పొదుపు, సంరక్షణలో జాతీయ స్ధాయిలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్, ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది కేంద్రం. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అవార్డును సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృద్వితేజ్‌ చూపించారు.

ఇదిలా ఉంటే.. వ్యవసాయ శాఖ మరో అవార్డు కైవసం చేసుకుంది ఏపీ. ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ప్రఖ్యాత అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవార్డు దక్కించుకుంది.

తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. శేఖర్‌ బాబు గెడ్డం బుధవారం కలిశారు. సీఎం జగన్‌ నేతృత్వంలో గడిచిన మూడున్నరేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో అత్యుత్తమ పాలసీ విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఏపీ ప్రభుత్వం కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version